హైదరాబాద్ నవంబర్ 22
తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతులను పట్టించుకోలేదన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మూడేండ్లలో రూ. 3,384.95 కోట్ల రైతు బీమా పరిహారం
అందించామని తెలిపారు. 67,699 మంది రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున అందించామన్నారు.రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నాణ్యమైన కరెంట్ వంటి పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? అని
ప్రశ్నించారు. ఏడాదికి రూ. 60 వేల కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఖర్చు చేస్తున్నాం. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.