తిరుమల,మా ప్రతినిధి, అక్టోబర్ 27,
మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలు, కాఫీ టేబుల్ బుక్, 2022 డైరీ, క్యాలెండర్ అందజేశారు.