నెల్లూరు
నెల్లూరు జిల్లా ,రాపూరు మండలం కేంద్ర పరిధిలోని ఎర్ర చెరువును సుందరంగా,ఆహ్లాదకరంగా అభివృద్ధి చేయడానికి జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మంగళవారం శ్రీకారం చుట్టారు .రాపూరు గ్రామ కొలను ఎర్ర చెరువును మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ చక్రధర్ బాబు సంబంధిత ఇరిగేషన్ అధికారులతో కలిసి చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు.పరిశీలన అనంతరం ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో మంజూరు కాబడిన 6 గ్రామ కొలనులను సుందరీకరణతో అభివృద్ధి చేయడానికి తయారు చేసిన, సవరించిన అంచనాలను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆమోదించి, మంజూరు చేసి వున్నారని తద్వారా,బాలాయపల్లి మండలం, మన్నూరు గ్రామ కొలనుకు రూ.44.20 లక్షల బదులు రూ. 51.38 లక్షలు — డక్కిలి మండలం డక్కిలి గ్రామ కొలనుకు రూ.78 లక్షలు బదులు రూ. 91.09 లక్షలు — కలువాయి మండలం,పర్లకొండ గ్రామ కొలనుకు రూ. 64.82 లక్షల బదులు రూ. 78.25 లక్షలు — రాపూరు మండలం,రాపూరు ఎర్ర ట్యాంకు (గ్రామ కొలనుకు) పాత రేటు రూ.99 లక్షల బదులు రూ. 105.13 లక్షలు — సైదాపురం మండలం, సైదాపురం గ్రామ కొలనుకు రూ.53.56 లక్షలు మరియు కొత్త రేటు రూ. 56.56 లక్షలు — వెంకటగిరి మండలం, వల్లివేడు గ్రామ కొలనుకు పాత రేటు రూ.78 లక్షలు బదులు కొత్త రేటు రూ. 97.47 లక్షలుగా వెరసి మొత్తం రూ. 479.88 లక్షల నిధులు మంజూరు చేశామన్నారు.సదరు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు స్థానిక వైకాపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.