నెల్లూరు
వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ శేఖర్ బాబు తో వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి మంగళవారం సుదీర్ఘంగా చర్చించారు.నెల్లూరు జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు మరియు పంచాయతీరాజ్ సూపరింటిండెంట్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం తదితర ఇంజనీర్లతో వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా,మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి విజ్ఞప్తి మేరకు,వెంకటగిరి నియోజకవర్గ కేంద్రంలో శిధిలావస్థలో ఉన్న పురాతన తహసిల్దార్ కార్యాలయ భవనాలను తొలగించి ,వాటి స్థానంలో కోటి పది లక్షల తో నూతన భవన సముదాయం.మరియు గతంలో అసెంబ్లీ / సమితి కేంద్రమైన రాపూరు నందు తహసిల్దార్, సబ్ రిజిష్టారు, సబ్ ట్రెజరీ కార్యాలయాలకు,ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్న భవనాలు తొలగించి , అదే ప్రదేశంలో 2.30 కోట్లు వెచ్చించి, అధునాతన భవన సముదాయం నిర్మించుటకు కలెక్టర్ ఆమోదించినందున,వాటికి అవసరమైన నిధులను జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో కలెక్టర్ నిధులు, సీఎం డి నిధులు, ఎంపీ లాండ్స్ నిధులు కేటాయింపు ద్వారా యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టడానికి చర్యలు తీసుకొంటున్నామన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘంగా చర్చించారు.