నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని 10 బొల్లవరం గ్రామ సచివాలయాన్ని శుక్రవారం నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా సచివాలయం నందు గల రికార్డులను పరిశీలించడంతో పాటుగా, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ అందరూ సమన్వయంతో పనిచేసి ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయాలని సూచించారు. సచివాలయ వ్యవస్థపై ఉద్యోగులు పట్టు సాధించాలన్నారు. వాలంటీర్ల సహకారంతో పారిశుధ్యం మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలన్నారు. పంచాయతీల అభివృద్ధికి సచివాలయ ఉద్యోగులు కీలకమన్నారు. గృహాలు, రేషన్ కార్డులు, పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించి ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్నారు.
సచివాలయం సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు.గ్రామ వాలంటరీల సేవలను కొనియాడారు.కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం శర్మ, పంచాయతీ కార్యదర్శి గోవిందు , గ్రామ రెవిన్యూ అధికారి పవిత్ర, సచివాలయం సిబ్బంది రమణా రెడ్డి, రాజేష్, అబ్దుల్ కలాం, మురళి, రాజేశ్వరి ,మహిళా పోలీస్ లక్ష్మమ్మ, గ్రామ వాలంటరీలు పాల్గొన్నారు.