Home తెలంగాణ క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే చిన్నయ్య

క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే చిన్నయ్య

292
0

బెల్లంపల్లి సెప్టెంబర్ 15 :
బెల్లంపల్లి ఎ. ఎం. సి. గ్రౌండ్స్ లో  తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం అండర్ 19 జోనల్ క్రికెట్ టోర్నమెంట్   పోటీలను బెల్లంపల్లి   ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. అనంతరం  ఎమ్మెల్యే  చిన్నయ్య మాట్లాడుతూ  క్రీడాకారులు తమ క్రీడా స్ఫూర్తిని చాటుకోవాలని కోరారు. ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడానికి మును ముందు మరెన్నో టోర్నమెంట్ నిర్వహించడంలో  పూర్తి సహాయ సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. క్రీడలను  ప్రోత్సహించడంలో  ఎప్పుడు ముందుంటామని క్రీడలు మానసిక వికాసాన్ని కలిగిస్తాయన్నారు. నాలుగు జిల్లాలనుండి క్రీడాకారులు  పాల్గొంటున్న  ఈ క్రికెట్ టోర్నమెంట్ మూడు రోజులు జరుగుతుందని  నిర్వాహకులు అల్లం వెంకటేశ్వర్లు  తెలిపారు ఈ కార్యక్రమం లోమున్సిపల్ చైర్పర్సన్ శ్వేత శ్రీధర్ , టోర్నమెంట్ అధ్యక్షులు బెల్లంపల్లి రూరల్  సి.ఐ.. జగదీష్ , మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, మార్కెట్ కమిటీ చైర్మన్  కళ్యాణి భీమా  గౌడ్, డాక్టర్ డి. యశ్వంత్, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు  హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి, ఆ సోసియేషన్ సభ్యులు  జాడి శేఖర్, నాగపూరి సాయి, ఎ. గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

Previous articleఅకాల మరణం చెందిన పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
Next articleగృహాలు నిర్మించకపోతే పట్టాలు కూడా రద్దు చేస్తాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here