బెల్లంపల్లి సెప్టెంబర్ 22
బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామంలో జాతీయ హెల్త్ మిషన్ నిధులలో నుండి 16 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న ఆరోగ్య ఉప కేంద్రం పనులను బుధవారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ , బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ , వైస్ ఎంపీపీ రాణి-సురేష్ మండల అధ్యక్షుడు గణేష్ గౌడ్ , సర్పంచ్ ఉమాదేవి , ఎంపీటీసీ సుభాష్ రావు , మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టిఆర్ ఎస్ పార్టీ యువజన అధ్యక్షుడు మహేందర్, ప్రజాప్రతినిధులు, టిఆర్ ఎస్ నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు