హైదరాబాద్ నవంబర్ 17
ఎమ్మెల్యే కోట్లా ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలన కార్యక్రమం పూర్తయింది. ఎన్నికల పరిశీలకుడు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి మహేశ్ ఆధ్వర్యంలో పరిశీలన చేపట్టగా.. టీఆర్‌ఎస్, శ్రమజీవి పార్టీల అభ్యర్థులు హాజరయ్యారు. శ్రమజీవి పార్టీ అభ్యర్థులు భాస్కర్, కోయల్కర్ దాఖలు చేసిన నామినేషన్లను తిరస్కరించారు. ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తేల్చారు.శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, పాడి కౌశిక్‌రెడ్డి, సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు టీఆర్‌ఎస్ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన విషయం విదితమే.ఇదిలా ఉండగా.. నామినేషన్ ఆమోదం పొందాలంటే పది మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించాల్సి ఉంటుంది. శ్రమజీవి అభ్యర్థులిద్దరినీ ఏ ఒక్క ఎమ్మెల్యే పత్రిపాదించలేదని, ఈ క్రమంలో వారి నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు. కాగా, నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం వరకు గడువు ఉన్నది.
Home తెలంగాణ ఎమ్మెల్యే కోట్లా ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలన పూర్తి శ్రమజీవి పార్టీ అభ్యర్థులు భాస్కర్, కోయల్కర్...