నెల్లూరు అక్టోబర్ 4
కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో నల్లపరెడ్డి సొంత మండలంలో ఎంపీటీసీ స్థానాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కోట పంచాయతీలో ఏ పని జరగాలన్నా వైసీపీ నేతలు లంచాలు లేనిదే చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపెనింగ్ కార్యక్రమానికి పిలిస్తే డబ్బులు డిమాండ్ చేయమేంటని ప్రసన్న కుమార్ రెడ్డి మండిపడ్డారు. కొందరు వైసీపీ నేతల వల్ల తన కుటుంబ పరువు పోయిందని వాపోయారు. సొంత మనుషులు ఇతర పార్టీలోకి, ఇతర వర్గాలకి వెళ్లిపోవడం చాలా బాధాకరమన్నారు. కంచుకోటగా ఏర్పాటు చేసిన తన మండలం, తన ఊరిలో ఇలా తమ ఉనికిని కోల్పోవడం చూస్తే కన్నీళ్లొస్తున్నాయని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
Home ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేతల పై ఎమ్మెల్యే నల్లపురెడ్డి సంచలన వ్యాఖ్యలు ఏ పని జరగాలన్నా లంచాలు లేనిదే...