Home ఆంధ్రప్రదేశ్ సీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిని ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే ప్రసన్న

సీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిని ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే ప్రసన్న

136
0

నెల్లూరు
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, బుచ్చిరెడ్డిపాలెం మండలం వైకాపా విస్తృతస్థాయి ఈ సమావేశంలో భాగంగా డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం వవ్వేరు బ్యాంకు చైర్మన్ సొర శ్రీనివాస్ రెడ్డి మరియు  బుచ్చిరెడ్డిపాళెం మండల వైకాపా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో పనికి తగ్గ ఫలితం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి సహకారం అందించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పదాన నడుస్తుందని పేర్కొన్నారు. రానున్న 2024 నాటికి కోవూరు నియోజకవర్గంలో వైకాపా అత్యధిక స్థాయిలో మెజారిటీ సాధించేందుకు ప్రతి కార్యకర్త తన వంతు బాధ్యతగా ఆయా ప్రాంతాలలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి మొదటినుంచి పార్టీ బలోపేతానికి, ఆయా ప్రాంతాల అభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి ఎంతో కృషి చేశాడని అందుకు తగ్గట్టుగా రెండుసార్లుగా పార్టీ అధిష్టానం డీసీఎంఎస్ చైర్మన్ పదవిని కట్టబెట్టిందని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Previous articleటిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా అల్లూరి మ‌ల్లిశ్వ‌రి ప్రమాణస్వీకారం
Next articleమంత్రి బాలినేని కి ఘనస్వాగతం పలికిన శ్రీకిరెడ్డి శశిధర్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here