నంద్యాల
బుధవారం నాడు నంద్యాల పట్టణంలోని నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీనీ సందర్శించిన ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు షాప్ చైర్మన్ బై రెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సందర్శించి మూడు జిల్లాల స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోస్టర్ను విడుదల చేయడం జరిగిందన్నారు .
ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బ్యాడ్మింటన్ స్టేడియం నిర్మించడం చాలా గొప్ప విషయం అని క్రీడాకారులు అందరూ ఇటువంటి సేవలు వినియోగించుకోవాలని కోరారు.
షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీ వారు నిర్వహిస్తున్న టోర్నమెంట్ సక్సెస్ కావాలని ఆకాంక్షించారు.
ఇటువంటి స్టేడియం నిర్మించడం చాలా ఖర్చుతో కూడుకున్నదని అయినా స్పోర్ట్స్ మీద మక్కువతో డాక్టర్ లక్ష్మయ్య , డాక్టర్ వినోద్ కుమార్ మరియు వి. శ్రీనివాస్ గుప్త నిర్మించి క్రీడాకారులకు సహాయపడుతూ నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే దాదాపు100 పైగా పిల్లలను ట్రైన్ చేస్తున్న కోచ్ టి .రాధాకృష్ణను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో రమేష్ , మున్సిపల్ వైస్ చైర్మన్ గంగి శెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు
Home ఆంధ్రప్రదేశ్ నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీనీ సందర్శించిన ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి, చైర్మన్ బైరెడ్డి...