పత్తికొండ
పత్తికొండ పట్టణం స్థానిక కొండగేరి లో సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు, వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు నిలబడి బురద మయంగా మారుతుందని కాలనీవాసులు సమస్యను ఎమ్మెల్యే శ్రీదేవమ్మ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాలనీలో పర్యటించి వీలైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని, పత్తికొండ మేజర్ పంచాయతీ కార్యదర్శి ఈఓ కృష్ణ కుమార్ కి ఆదేశించడం జరిగింది. ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ ఇలా మరెన్నో వీధుల్లో ఇబ్బందులు పడుతున్నారని, సమయానుకూలంగా అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలను దృష్టిలో ఉంచుకొని కలనీలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. సీజన్ వ్యాధులు సోకకుండా వైద్యులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ ఎంపీపీ నారాయణ దాస్, ఉప్పర సంఘం రాష్ట్ర డైరెక్టర్ బజారప్ప, వైఎస్సార్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు, వైస్ ఎంపీపీ బలరాముడు, కో ఆప్షన్ మెంబర్ నజీర్, వార్డ్ మెంబర్ సుంకన్న , షాధికనా కమిటీ చైర్మన్ హనీఫ్, కొమ్ము నెట్టేకల్, వైయస్సార్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ ఎంఎస్ మధు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.
Home ఆంధ్రప్రదేశ్ సమస్యకు స్పందించిన ఎమ్మెల్యే శ్రీదేవి * వీధుల్లో పర్యటించిన ఎమ్మెల్యే * అధికారులకు ఆదేశాలు జారీ