జగిత్యాల అక్టోబర్ 09
మహా బతుకమ్మ ఉత్సవాల పోస్టర్ ను శనివారం జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మున్సిపల్ ఛైర్పర్సన్ భోగ.శ్రావణి తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అడబిడ్డలు అందరికి ఇష్టమైన పండుగ సంబరంగా చేసుకునే పూల పండగ, పూలనే పూజించే పండుగ బతుకమ్మను మున్సిపల్ ఆధ్వర్యములో మహా బతుకమ్మ ఉత్సవము నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు. మహా బతుకమ్మ ఉత్సవ సంబరాలు మంగళవారం అందరూ మహిళలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్వరూపా రాణి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు కుసరి అనిల్, వల్లేపు రేణుక, మేక పద్మావతి, అడువాల జ్యోతి, చుక్క నవీన్, జుంబర్టి రాజ్ కుమార్, కప్పల శ్రీకాంత్, గుర్రం రమేష్, కో.ఆప్షన్ శ్రీనివాస్, నాయకులు సమిండ్ల శ్రీను, కొత్తకొండ అంజయ్య, కొలగాని సత్యం, ముఖేష్ ఖన్న, మాజీ మున్సిపల్ చైర్మన్ దేశాయ్, సతీష్ రాజ్ లు ఉన్నారు.