హైదరాబాద్
సంగమేశ్వర బసవేశ్వర కు ఆమోదం తెలిపి పరిపాలన అనుమతులు ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు జల్లా ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరిష రావు నేతృత్వంలో ఆందోల్ ఎమ్యెల్యే క్రాంతి కిరణ్, నారాయణఖేడ్ ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్యెల్యే మాణిక్ రావు గురువారం శాసన సభలో ముఖ్యమంత్రి ని కలిశారు. ఎన్నో ఏండ్లుగా వివక్షకు గురైన ఆందోల్ జహీరాబాద్ నారాయణఖేడ్ నియోజకవర్గాలు కేసీఆర్ చొరవతో సస్యశామలంగా మారనున్నయంటూ ముఖ్యమంత్రి కే సి ఆర్కి దన్యవాదాలు తెలిపారు. కొన్ని వేల ఎకరాలు సాగు నీరు అందించేకార్యక్రమంలో భాగస్వాములవుతున్నందుకు ఎమ్యెల్యే లను ముఖ్యమంత్రి అభినందించారు. “పనులను త్వరలోనే మొదలు పెడుదాం… మొదలు పెట్టాక తొందరగా పూర్తి అయ్యేటట్టు చూస్కోవాల్నిన బాధ్యత మీదే” అని కేసీఆర్ ఎమ్యెల్యేలను ఉద్దేశించి అన్నారు.