Home తెలంగాణ “సిరిసిల్ల బ్రదర్స్” కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శ పాత్రికేయులను పరామర్శించిన...

“సిరిసిల్ల బ్రదర్స్” కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శ పాత్రికేయులను పరామర్శించిన వాస్తుపండితులు వేణుగోపాలా చార్యా

88
0

జగిత్యాల,అక్టొబర్ 21
గత నాలుగు రోజుల క్రితం వేద బ్రాహ్మనోత్తములడు  సిరిసిల్ల సాంబయ్యశర్మ మృతి చెందగా వారి కుటుంబాన్ని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి పరామర్శించారు.హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్సీ మృతిచెందిన వార్త విని ఫోన్ లో కుటుంసభ్యులను పరమర్శించారు.
జగిత్యాలకు చేరుకున్న జీవన్ రెడ్డి  గురువారం జగిత్యాలలోని మృతుడి ఇంటికి  వెళ్ళి సాంబయ్య శర్మ కుమారులైన సీనియర్ పాత్రికేయులు సిరిసిల్ల శ్రీనివాస్,సిరిసిల్ల వేణుగోపాల్ లతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సాంబయ్య శర్మ మృతికి సంతాపం తెలిపి “సిరిసిల్ల బ్రదర్స్” కు  ప్రగాడ సానుభూతి తెలిపారు.
అలాగే  జగిత్యాలకు చెందిన   ప్రముఖ వాస్తు శాస్త్ర పండితులు నంభి వేణుగోపాలా చార్యా కౌశిక మృతుడి కుటుంబ సభ్యులైన సీనియర్ జర్నలిస్టులను పరామర్శించి,వారిని ఒధార్చారు.
వీరి వెంట జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు తాoడ్ర సురేందర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్య,మాజీ కౌన్సిలర్లు గాజుల రాజేందర్,రేపల్లే హరికృష్ణ,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండా మధు, టిఎన్జీఓ నేతలు  భోగ శశిధర్, వకీల్, సీనియర్ పాత్రికేయులు పి ఎస్ రంగారావు,రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి మంచాల కృష్ణ, లాయర్లు శ్రీపాల్ రెడ్డి, ఎర్ర నర్సయ్య,పి.శ్రీనివాస్ తదితరులున్నారు.

Previous articleగంజాయ్ రహిత జిల్లాగా మార్చాలి గంజాయి రవాణా, విక్రయాల పై పటిష్ట నిఘా గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పట్ల నిఘా ఉంచాలి జిల్లా ఎస్పీ సింధు శర్మ
Next articleలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలి – పోలిసుల త్యాగం అజరామరం – పెద్దపల్లి డిసిపి పి.రవీందర్ – పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు, కుటుంబ సభ్యులకు పరామర్శ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here