Home ఆంధ్రప్రదేశ్ గూడూరు ఎంపీపీ మరియు ఉప ఎంపీపీ లకు ఎమ్మెల్సీ బల్లి అభినందనలు.

గూడూరు ఎంపీపీ మరియు ఉప ఎంపీపీ లకు ఎమ్మెల్సీ బల్లి అభినందనలు.

77
0

నెల్లూరు
నెల్లూరు జిల్లా, గూడూరు మండల పరిషత్  అధ్యక్ష పీఠం వైకాపా కైవసం చేసుకుంది. శుక్రవారం గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ, ఉప ఎంపిపి ప్రమాణ స్వీకారం కార్యక్రమం రిటర్నింగ్ అధికారులు నిర్వహించారు.మొత్తం 8 మంది ఎంపీటీసీ లల్లో 6 మంది ఎంపిటిసిలు హాజరు అయ్యారు. ఓటింగ్ లో 6 మంది ఎంపీటీసీ సభ్యులు వేడిచర్ల ఎంపిటిసి సెగ్మెంట్ సభ్యులు బూదూరు గురవయ్య ఎంపిపి అభ్యర్ధి కావడంతో ఆయనకు అందరూ ఓటు వేసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అదే విధంగా ఉపాధ్యక్షుడుగా వైస్ ఎంపీపీగా మెడనోలు శ్రీనివాసులు రెడ్డి,కో ఆప్షన్ సభ్యుడిగా మన్సూర్ అహ్మద్ లను ఎంపీటీసీ లు ఓట్లు వేసి ఏకగ్రీవంగాఎన్నుకున్నారు.ఎంపిపి, ఉప ఎంపిపి ప్రమాణస్వీకార కార్యక్రమంలోఎటువంటివివాదాలు,గొడవలులేకుండా విప్ ప్రకారం కార్యక్రమంజరిగింది.శుక్రవారం ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు గూడూరులో ఎమ్మెల్యే స్వగృహంలో  ఎంపీపీ,ఉప ఎంపిపి అభ్యర్థులకు బీఫామ్ అందజేశారు., మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వైస్ ఎంపీపీగా ఎన్నికైన వారిచేత ఎన్నికల రిటర్నింగ్ అధికారిప్రమాణస్వీకారంచేయించారు.గూడూరు మండలంలో 8 ఎంపిటిసిసభ్యులలో  , ఎంపీపీ ఎన్నికకు ఇద్దరు హాజరు కాలేదు .టీడీపీతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది వైసీపీలో చేరిన కొమ్మ నేటూరు ఎంపిటిసి అభ్యర్థి కూడా హాజరు కాకపోవడం అందరిని ఆచ్యర్యానికి గురిచేసింది.రిటర్నింగ్ అధికారి వీరాంజనేయులు ప్రమాణ స్వీకారం చేయించి,ఎన్నిక పత్రాన్ని ఎంపీపీ,వైస్ ఎంపీపీ కి అందజేశారు.

Previous articleబారుజోల తారు రోడ్డు పనులు పూర్తి చేయాలి
Next articleనాడు-నేడు కార్యక్రమంపై శిక్షణ తరగతులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here