Home జాతీయ వార్తలు 4 గంట‌ల మోదీ ప‌ర్య‌ట‌న‌కు రూ. 23 కోట్లు ఖ‌ర్చు!?

4 గంట‌ల మోదీ ప‌ర్య‌ట‌న‌కు రూ. 23 కోట్లు ఖ‌ర్చు!?

109
0

భోపాల్ నవంబర్ 13
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వ‌చ్చే వారం మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌మ్‌బూరీ మైదాన్‌లో నిర్వ‌హించే జ‌న్ జాతీయ గౌర‌వ్ దివాస్ కార్య‌క్ర‌మంలో మోదీ పాల్గొననున్నారు. న‌వంబ‌ర్ 15న భ‌గ‌వాన్ బిర్సా ముండా జ్ఞాప‌కార్థం గిరిజ‌నులు ఈ ఉత్స‌వాన్ని జ‌రుపుకుంటారు. ఈ స‌మావేశంలో మోదీ పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు.ఈ క్ర‌మంలో మోదీ కేవ‌లం 4 గంట‌లు మాత్ర‌మే భోపాల్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇందుకు రూ. 23 కోట్ల‌కు పైగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ స‌భ‌కు మ‌ధ్య‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా ఉన్న గిరిజ‌నుల‌ను త‌ర‌లించేందుకు రూ. 13 కోట్లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మోదీ హ‌బీబ్‌గంజ్ రైల్వే స్టేష‌న్‌ను జాతికి అంకితం చేయ‌నున్నారు. దేశంలోనే తొలిసారిగా ప‌బ్లిక్, ప్ర‌యివేటు పార్ట్‌న‌ర్‌షిప్‌లో ఈ స్టేష‌న్‌ను నిర్మించారు.

Previous articleజనవరి 26న విడుదల కానున్న అశోక్ గల్లా, శ్రీరామ్ ఆదిత్య ‘హీరో.
Next articleసామాజిక స్పృహతో పని చేసేవారిని ప్రతినిధులుగాఎన్నుకోవాలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here