నెల్లూరు
నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థిని, వైకాపా బలపరిచిన మోర్ల సుప్రజ 4వ వార్డు కౌన్సిలర్ గా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త అయిన మురళి మురళి చొరవతో, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఆశీస్సులతో రాజకీయ రంగప్రవేశ అవకాశం కలిగిందన్నారు. స్థానిక శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు మరియు స్థానిక వైకాపా నాయకుల సహాయ సహకారాలతో 4వ వార్డు కౌన్సిలర్ గా ఘన విజయం సాధించేందుకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయని పేర్కొన్నారు. అతిరథమహారధ రాజకీయ సీనియర్లు, స్థానిక నాయకుల సహకారం మరచిపోలేమన్నారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి రావు మాట్లాడుతూ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సూచనలు సలహాల మేరకు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులలో వైకాపా అభ్యర్థులు ఘన విజయం సాధించి పర్సన్ పదవి దక్కించుకుంటామని కార్యక్రమానికి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తొలుత అతిరథమహారధులు నడుమ బాజాభజంత్రీలతో, మేళతాళాలతో అంగరంగ వైభవంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ వీరి చలపతిరావ వవ్వేరు బ్యాంకు సూరా శ్రీనివాసులు రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Home ఆంధ్రప్రదేశ్ బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయితీ 4 వ వార్డు కౌన్సిలర్గా నామినేషన్ దాఖలు చేసిన మోర్ల సుప్రజ