నెల్లూరు
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ కె .వి. ఎన్. చక్రధర్ బాబును క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమస్యలపై ఆయనతో మాట్లాడారు. ఈ విషయమై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు మరియు పనులు నిర్వహణ గురించి కలెక్టర్ తో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. ఆయనతోపాటు విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, పాముల హరి, నరసింహారావు, మధు తదితరులు ఆయనతోపాటు ఉన్నారు