యాదాద్రి
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి శుక్రవారం నాడు రెండు కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. సతిసమేతంగా ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత ఆలయ ఈవోకు బంగారాన్ని అందజేసారు. అయనకు ఆలయ వేద పండితులు ఆశీర్వచనాన్ని అందించారు.