నంద్యాల
ఆయుష్ యోగా సేవాసమితి నిర్వాహకులు ఆనంద్ గురూజీ శారీరక, మానసిక, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేదే యోగా అని, యోగాతో ఆరోగ్యంతో పాటు ఒత్తిడిని తట్టుకునే శక్తి కలిగి ఉంటుందని. ఆయుష్ యోగా సేవా సమితి నిర్వాహకులు ఆనంద్ గురూజీ పేర్కొన్నారు. మున్సిపల్ టౌన్ హాల్ పక్కన గల మున్సిపల్ పార్కునందు ఆయుష్ యోగా సేవా సమితి కేంద్రంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆనంద్ గురూజీతో పాటు సీనియర్ పాత్రికేయులు అండ్ 12వ వార్డు కౌన్సిలర్ ఖండే శ్యాంసుందర్ లాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ గురూజీ మాట్లాడుతూ ఈ నెల పదవ తేదీ ఆదివారం ఆయుష్ యోగా కేంద్రంలో 18 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అధునాతన జిమ్, అక్యుప్రెజర్ తదితర పరికరాలను నంద్యాల ఎంపి. పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ షేక్ మాబున్నిసా, కమిషనర్ వెంకట కృష్ణుడు తదితర
ప్రముఖులు ప్రారంభిస్తారని తెలిపారు , కావున పుర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పదిహేను సంవత్సరాల నుండి తాను యోగా కేంద్రాన్ని నిర్వహిస్తున్నానని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజల ఆరోగ్యమే మహా భాగ్యంగా, వారిని తీర్చిదిద్దేందుకు తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఆనంద్ గురూజీ తెలిపారు. నేటి ఆధునిక కాలంలో మనుషులు కాలంతో పోటీ పడుతూ తమ ఆరోగ్యాన్ని చేజేతులా పాడుచేసుకుంటున్నారని తెలిపారు , చిన్న తనంలోనే అనేక వ్యాధులు, రుగ్మతలు వస్తున్నాయని, వాటిని
రూపుమాపేందుకు యోగా చక్కటి వ్యాయామమని పేర్కొన్నారు. 8 నెలల పాటు కష్టపడి యోగా సభ్యులతో దాదాపు 18 లక్షల విరాళాలు సేకరించి ఈ కేంద్రంలో జిమ్ తదితర పరికరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నడుము నొప్పి (బ్యాక్ పెయిన్), స్థూలకాయం (ఒబెసిటి), రక్తపోటు (బిపి), మధుమేహం (షుగర్) వున్న వారికి విడివిడిగా శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు , యోగాలో జలధౌతి, జలనేతి, సూత్రనేతి, వస్త్రధౌతి, సంఖ ప్రక్షాళన, క్రియలు నేర్పబడునని, కావున ఆసక్తి గల వారు ఈ యోగా కేంద్రంలో చేరి ఆరోగ్యవంతులుగా మెలగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ గురూజీ సతీమణి సులోచన, నాగరాజు, ఫణింద్ర, సూర్య నారాయణ, ఎల్లయ్య, సుధ, సుకన్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Home ఆంధ్రప్రదేశ్ ఆదివారం అధునాతన జిమ్, యోగా కేంద్రాన్ని ప్రారంభించనున్న ఎంపి, ఎమ్మెల్యే ఆనంద్ గురూజీ