అమరావతి
జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ హై కోర్టులో ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ ని హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ రద్దు పిటిషన్ పై సిబీఐ కోర్టు ఇవ్వాళ ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ రఘురామ కోరగా కోర్టు తిరస్కరించింది. సాక్షి పేపర్ లో బెయిల్ రద్దు అని కోర్ట్ ఆర్డర్ రాకుండానే రాసారని , విజయ్ సాయి రెడ్డి విదేశాలకు అనుమతి ఇచ్చారు కాబట్టి వేరే బెంచు కి మార్చాలని రఘురామ కృష్ణరాజు కోరారు. అయితే పిటిషన్ పై బలమైన వాదనలు లేకపోవడం, సీబీఐ కూడా పిటిషనర్ వాదనను తోసిపుచడంతో.. రఘురామ కృష్ణరాజు పిటిషన్ ని కోర్టు తోసిపుచ్చింది.