Home తెలంగాణ రద్దైన చట్టాలపై రైతులకు అవగాహన కల్పించిన ఎంపీలు బండి,అరవింద్ క్షమాపణ చెప్పాలి రైతు...

రద్దైన చట్టాలపై రైతులకు అవగాహన కల్పించిన ఎంపీలు బండి,అరవింద్ క్షమాపణ చెప్పాలి రైతు వ్యతిరేక చట్టాలకు అజ్యం పోసింది కాంగ్రెస్సే. జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

276
0

జగిత్యాల నవంబర్ 19
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆది నుంచి కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిందని ఫలితంగా నేడు కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆన్నారు.శుక్రవారం పట్టణంలోని తెరస పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జడ్పీచైర్పర్సన్ దావ వసంత,రైతు నాయకులతో కలసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతే రాజు లక్ష్యంగా రాష్ట్ర సర్కారు పనిచేస్తుంటే రైతులను కూలీలుగా మార్చే చట్టాలను కేంద్రం తీసుకురావటం,రైతుల ఆందోళనలతో గురునానక్ జయంతి రోజు చట్టాలను రద్దు చేయటం రైతు విజయమన్నారు.
రైతులు పండించిన పంట ఎక్కడైన అమ్ముకోవచ్చనే విధానంతో సామన్య రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగేవని,కాంటాక్ట్ ఫార్మింగ్ పేరుతో చెప్పిన పంట వేసి నష్టపోయే అవకాశం తీవ్రంగా ఉండేదని,దీంతో పాటు నిత్యవసర చట్టం రద్దు చేయటం రైతులకు పెద్ద ఊరటనిచ్చే అంశమన్నారు .రైతు సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమని,కాలువలు తవ్వి నీరు రాని పరిస్దితుల్లో దారి చూపి నియోజకవర్గాన్ని జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనన్నారు.కాలువలకు తూములు,చెక్ డ్యాంలు నిర్మించి ఎన్నో మండలాలకు నీరందించామన్నారు.రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ చీకటి అవుతుందని ప్రచారం చేసిన కాంగ్రెస్ అభాసుపాలయ్యిందన్నారు.కేంద్రం రద్దు చేసిన నేటి చట్టాలపై రాష్ట్ర బీజేపీ నాయకులు ఎంపీలు బండిసంజయ్,అరవింద్ లు ఇవే చట్టాలపై అవగాహన కల్పిస్తూ సభలు ఏర్పాటు చేయటం హాస్యాస్పదమని,వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.మోటార్లకు మీటర్లు బిగించే చట్టం తీసుకొస్తే  రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడిందన్నారు.కేంద్రం రైతు సంక్షేమం,వ్యవసాయ విధానంలో ఘెరంగా విఫలమయ్యిందన్నారు.రైతుల ఆదాయం ఐదింతలు రెట్టింపు చేశామన్న కేంద్రం కనీసం రెండింతలు చేశారా తెలియజేయాలన్నారు.రైతుబంధు,రైతుభీమా,24 గంటల విద్యుత్ లో కేంద్రం పాత్ర ఏమైనా ఉందా చెప్పాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ నాయకులు సైతం ఈ చట్టాలకు అజ్యం పోసినవారేనని అన్నారు.రైతులపై కపట ప్రేమ చూపే కాంగ్రెస్ నాయకులు ఒక్క కోల్ట్ స్టోరేజ్ ను సైతం నిర్మించలేకపోగా రైతులను అదుకున్నది తామేనని ప్రగల్భాలు పలుకుతారని అన్నారు.రైతుల గోస కాంగ్రెస్,బీజేపీ నాయకులకు తగులుతదని
ఎమ్మెల్యే ఆన్నారు.ఈ సందర్బంగా ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన రైతు ధర్నాను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎమ్మెల్యే తెలిపారు ..ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మహేష్,మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్ రావ్,పీఎసీఎస్ చైర్మన్ మహిపాల్ రెడ్డి,రైతుబంధు సమితి మండల కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Previous articleసభలో చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను ఎవరూ ప్రస్తావించలేదు
Next articleమహ్మద్ ప్రవక్త పై దుష్ప్రచారంను ఖండించిన జామా మజీద్ కమిటీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here