Home తెలంగాణ మూలవాగు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరగకుండా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలి : ...

మూలవాగు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరగకుండా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలి : అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. సత్య ప్రసాద్

83
0

రాజన్న సిరిసిల్ల
వేములవాడ మూలవాగు ఒడ్డున అక్రమ నిర్మాణాలు జరగకుండా మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, తగిన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. సత్య ప్రసాద్ ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ మున్సిపల్ అధికారులతో కలిసి మూలవాగు ప్రాంతాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి, పట్టణ పరిధిలో ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు జరిగితే వెంటనే ఆపివేయాలని సూచించారు. ముఖ్యంగా మూలవాగు ప్రాంతంపై నిఘా ఉంచి అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ వెంట వేములవాడ మున్సిపల్ కమీషనర్ శ్యామ్ సుందర్ రావు, టౌన్ ప్లానింగ్ అధికారులు, తదితరులు ఉన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వ్యాక్సినేషన్ కేంద్రం తనిఖీ
చందుర్తి, ఇల్లంతకుంట మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, చందుర్తి మండలం మూడపెల్లి గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.సత్య ప్రసాద్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పురోగతి, రిజిస్టర్ ల నిర్వహణ, అందుబాటులో ఉన్న మందుల వివరాలు, తదితర అంశాలపై ఆరా తీశారు. ఆరోగ్య కార్యకర్తలు తమ పరిధిలోని ప్రజలకు రెండవ డోస్ వ్యాక్సిన్ కు అర్హులైన వారికి తెలియజెప్పి వ్యాక్సిన్ రెండవ డోస్ వేసుకునేలా చూడాలని అన్నారు. అలాగే సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి డా. సుమన్ మోహన్ రావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.

Previous articleవిజయ గర్జన సభ ను విజయవంతం చేయాలి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య…
Next articleవరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి -మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here