తాండూరు
వికారాబాద్ జిల్లా యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన వికారాబాద్ జిల్లాలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు కథనం ప్రకారం… యాలాల మండలంలోని తిమ్మాయిపల్లి గెట్ సమీపంలో పవన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న సీఐ జలంధర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడు మల్లప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడించినట్లు సమాచారం. నిందితుడు కురువ మల్లప్ప భార్య కురువ లక్ష్మికి బురుగుపల్లి పవన్ కు మధ్య గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ సంబంధం ఉన్న నేపథ్యంలో హత్యకు దారి తీసిన వైనం. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తాండూర్ డిఎస్పి లక్ష్మీనారాయణ తాండూరు రూరల్ సీఐ జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.