Home ఆంధ్రప్రదేశ్ గుప్త నిధుల మర్డర్

గుప్త నిధుల మర్డర్

184
0

నెల్లూరు
నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణం అగచాట్లపురంకు చెందిన రఫీ అనే వ్యక్తి అదృశ్యం అయి గుప్త నిధుల బ్యాచ్ చేతిలో మర్డర్ అయినట్టు తెలుస్తుంది.సెప్టంబర్ 3వ తేదిన అదృశ్యమైన రఫీ ఆచూకీ దొరకలేదు. అటు కుటుంబ సభ్యులు ఇటు బంధులు అన్నీ చోట్ల గాలించారు. అయినా ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో భార్య ఆరీఫా పోలీసులను ఆశ్రయించింది. ఇదిలా ఉండగా అసలు రఫీ ఎమైపోయాడో  అర్ధం కానీ పరిస్ధితి నెలకొంది. రఫీ అదృశ్యమై సుమారు 28 రోజుల తరువాత మర్డర్ అయినట్టు తెలిసింది.అదృశ్యమైన రఫీ అనే యువకుడు పొదలకూరు సమీపంలోని లింగంపల్లి వద్ద దర్గాలో ముజావర్ గా కొనసాగుతున్నాడు. గతంలో రఫీపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రెండు సార్లు కత్తితో దాడి చేశారు. అప్పట్లో ఈ ఘటన పట్టణంలో కలకలం రేపింది. ఆ ఘటనను పరిశీలిస్తే రఫీకి శత్రువులు ఎవరైన ఉన్నారా…! వారేమైన రఫీని కిడ్నాప్ చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.రఫీ అదృశ్యం మర్డర్ తో ముగియడంతో నెల్లూరులో క్రైమ్ రేటుకు అద్దంపడుతుంది.

Previous articleఅతివేగం ప్రాణాలు తీసింది
Next articleఅలీ చేతులమీదుగా విడుదలైన “వెల్లువ” టైటిల్ పోస్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here