కడప నవంబర్ 13
కడప నగర మహిళా అధ్యక్షురాలిగా మురికినాటి సునీత బాధ్యతలను స్వీకరించారు. తన కు అవకాశం కల్పించిన కడప నియోజకవర్గ ఇంచార్జ్ అమీర్ బాబు ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువ కప్పి కృతజ్ఞతలు చెప్పారు. పార్టీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. అమీర్ బాబు మాట్లాడుతూ కడప నగరంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం కోసం కృషి చేయాలని, మహీళా సమస్యలపై వెంటనే స్పందించి మహిళలకు అండగా నిలబడాలని సూచిస్తూ సునీతకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ ఇంచార్జ్ మురికినాటి రామాంజనేయులు పాల్గోన్నారు.