Home తెలంగాణ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

112
0

రాజన్న సిరిసిల్ల

ప్రతి ఒక్కరూ బాధ్యతా యుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు  మంగళవారం వార్షిక తనిఖీలో భాగంగా వేములవాడ సబ్ డివిజన్ కార్యాలయం తో పాటు   వేములవాడ పట్టణ పోలీస్

స్టేషన్   జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తనిఖీ చేశారు .వేములవాడ సబ్ డివిజన్ స్థాయిలో నమోదైన కీలకమైన కేసుల దస్త్రాల తనిఖీలు చేపట్టారు,డివిజన్ పరిధిలోని నమోదైన ప్రధాన కేసులు,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వివరాలను మరియు పెండింగ్

ఉన్న గ్రేవ్,నాన్ గ్రేవ్ కేసుల గురించి మరియు పెండింగ్ ఉన్న కేసులపై రివ్యూ  చేయడం జరిగింది.డివిజన్ పరిధిలోని కేసుల నమోదు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం వేములవాడ పట్టణ

పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు..పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణను,5s అమలు చేసిన తీరును అడిగి తెలుసుకున్నారు.రికార్డ్ రూమ్,రైటర్ రూమ్,రిసెప్షన్ తదితర అన్నివిభాగాలు తిరిగి క్షుణ్నంగా పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు..
అనంతరం

జిల్లా ఎస్పీమాట్లాడుతూపెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు దర్యాప్తు పూర్తిచేసి న్యాయస్థానంలో నిందితులను ప్రవేశ పెట్టాలని సూచించారు,పోలీస్ కేసుల విచారణ సమయంలో సాక్షులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టి నిందితులకు కఠినమైన శిక్షపడే

విధంగా రుజువు చేయాలని సూచించారు… పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి అధికారులకు సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు…
పోలీస్  స్టేషన్లో ఫంక్షనల్ వర్టికల్స్ అమలు

తీరును రిసెప్షన్, పనితీరు,100డయల్ ఎంత సమయంలో స్పందిస్తున్నారు, కోర్టు, సమన్స్, స్టేషన్ రైటర్, బ్లూ కోల్ట్స్ వర్టీకల్స్ అమలుతీరును  పోలీసు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు పోలీస్ స్టేషన్లో  ఫంక్షనల్  వర్టికల్స్ గురించి ఎస్సైలు నిత్యం

పర్యవేక్షించి పక్కాగా అమలు చేయాలని చెప్పారు..అనంతరం సిబ్బందితో మాట్లాడుతు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టి కి  తీసుకొని రావాలి అని సూచించారు.అనంతరం ఎస్పీ  సిబ్బందితో కలసి పోలీస్ స్టేషన్

ఆవరణలో మొక్కలు నాటారు..ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రకాంత్ ,సి.ఐ వెంకటేష్ ,ఎస్.ఐ లు రాజశేఖర్, రామచంద్రం, ప్రొహిబిషినరి ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.

Previous articleఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కి స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు అందజేసిన గవర్నర్ తమిళిసై
Next articleజెడ్ పి టి సి , ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సక్రమంగా జరుగుతున్నాయి ఎన్నికల అబ్జర్వర్ హరి జవహర్ లాల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here