బెల్లంపల్లి అక్టోబర్ 08 ::
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎసై నరేష్
బెల్లంపల్లి మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు కాసిపేట మండలం కోమటిచెనులో ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు చిప్ప మనోహర్, కాసిపేట ఎసై నరేష్ గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్నదాడులు,వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నిత్యం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజి చట్టం, నిర్భయ చట్టం, 354 పేరెంట్ ఆక్ట్ ,సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. న్యాయవాదులు అనిల్ కుమార్, సునీల్ ,ప్రామిసరి నోట్ ఏవిధంగా వినియోగించుకోవాలియని వివరించారు.ఎంమహిళా న్యాయవ్యాధులు, సంగీత, సౌమ్య లు మాట్లాడుతూ125 సీఆర్ పీఎస్ ,డివిసి పై ప్రజలకు వివరించారు, రాష్టంలో ప్రతి కార్యాలయంలో నిధులు ఏవిధంగా ఉపయోగించడం లాంటి వివరాలు తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం ఎంతో ఉపయోగపడుతుంది, దీనిపై ప్రతిఒక్కరు తెలుసుకోవాలి అని అన్నారు..ఈకార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిప్పమనోహర్,కాసిపేట ఎసై నరేష్,న్యాయవాదులు, అనిల్ కుమార్,సునీల్,సంగీత,సౌమ్య, సర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు…