రాజన్న సిరిసిల్ల
భారత రాజ్యాంగ స్పూర్తితో ప్రజలకుమరింతసమర్ధవంతంగా సేవలందిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ అన్నారు.భారత రాజ్యాంగం అధికారికంగా అమలులోకి వచ్చిన దినోత్సవ సందర్బంగా ఆయన జిల్లా పోలీసు కార్యాలయఅధికారులు, సిబ్బంది, పోలీస్ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసిస్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూయావత్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని దేశానికి అందించిన మహానీయుడు అంబేద్కర్ అని, దేశ ప్రజలంతా సమానత్వం, శాంతి, సౌబ్రాతృత్వంతో జీవించాలన్న సంకల్పంతో రాజ్యాంగంలో ప్రజలకు హక్కులు కల్పించడంతో పాటు దేశాభివృదికి విధులను సైతం సూచించారని గుర్తు చేశారు. దేశంలోని ప్రజలంతా తమ హక్కులతో పాటు విధుల పట్ల స్పష్టమైన అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలంతా స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించి శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతలను పోలీసులకు అప్పగించిందన్నారు. రాజ్యాంగ స్పూర్తితో ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందిస్తూ దేశాభివృద్ధిలో బాగస్వామ్యం కావాలని సూచించారు. భారత రాజ్యాంగం అధికారికంగా అమలులోకి వచ్చిన ఈ రోజును దేశ ప్రజలంతా ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణమని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్థంభంగా నిలవడమే కాక ప్రపంచ దేశాలకు మన దేశం ఆదర్శంగా నిలవడంలో భారత రాజ్యాంగం ప్రధాన భూమిక పోషిస్తుందని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ హమ్మదుల్లా ఖాన్,సూపరిడెంట్ సూర్యనారాయణ,జూనియర్ అసిస్టెంట్ దేవయ్య ఎస్. ఐ సునీల్ మరియు కార్యాలయ సిబ్బంది , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు