Home తెలంగాణ నిఘా నీడలో ముస్త్యాల సుందిల్ల ఫైవ్ ఏ చెక్ పోస్ట్ – సొంత...

నిఘా నీడలో ముస్త్యాల సుందిల్ల ఫైవ్ ఏ చెక్ పోస్ట్ – సొంత ఖర్చులతో సిసి కెమెరాలు ఏర్పాటు చేసిన సర్పంచ్ – సర్పంచ్ కృషి అభినందనీయం – గోదావరిఖని 2 టౌన్ సిఐ శ్రీనివాసరావు

95
0

పెద్దపల్లి సెప్టెంబర్ 22

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకపోవడం వలన నిత్యం జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు, హత్యలు, రోడ్డు ప్రమాదాలు చూస్తున్నాం. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే జరిగే లాభాలు కూడా చూస్తున్నాం ఇదే క్రమంలో ఫైవ్ ఎ చెక్ పోస్ట్ వద్ద ముస్త్యాల, సుందిల్ల ఎంట్రన్స్ ఊరి ముఖద్వారాల వద్ద ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో గతంలో ఈ ఏరియాలో దొంగతనాలు యాక్సిడెంట్లు జరగడంతో చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చిందని గమనించిన ముస్త్యాల సర్పంచ్ రామగిరి లావణ్య నాగరాజు ముందుకు వచ్చి సొంత ఖర్చులతో రెండు సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిథులుగా గోదావరిఖని టు టౌన్ సిఐ శ్రీనివాసరావు, సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి లు విచ్చేసి సిసి కెమెరాలు ప్రారంభించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతోనే నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలు ఉన్నట్లయితే నిత్యం నిఘా నీడలో ఆ ప్రాంతమంతా పటిష్ట రక్షణ స్థితిలో ఉన్నట్లేనని తెలిపారు. అదేవిధంగా గోదావరిఖని రేండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ఏరియాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పోలీసులకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని, నేరాల నియంత్రణకు తోడ్పాటును అందించాలని సూచించారు. ఏదైనా నేరం జరిగినట్లయితే సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవడానికి వీలుంటుందని అన్నారు. నిందితుడు తప్పించుకోవడానికి వీలులేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే పటిష్ట నిఘా వ్యవస్థ ఉండడం వలన నేరాలు అదుపులోకి వస్తాయని, నేరస్తుడు నేరం చేయడానికి జంకుతారని తెలిపారు. అదేవిధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు భుజాన వేసుకుని తన సొంత ఖర్చులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కృషి చేసిన స్థానిక సర్పంచ్ రామగిరి లావణ్య నాగరాజుని సిఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పరశురాం, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Previous articleరేవంత్ రెడ్డి నివాసంపై దాడికి నిరసనగా… ‘మెట్ పల్లిలో కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం
Next articleమహిళకు రక్తదానం చేసిన యువకుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here