నెల్లూరు
ఇద్దరు పిల్లల చదువుల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ,కావాలి పట్టణానికి చెందిన హరి కొండరాజు కుటుంబానికి 50 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని , స్థానిక కందుకూరు వైద్యశాల అధినేత ఎన్ రామస్వామి అందజేశారు . ఈ సందర్భంగా హరికొండరాజు మాట్లాడుతూ తనకు ఇద్దరు పిల్లలు మెడిసిన్ చదువుతున్నారని , చదువులకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ,ఆ సందర్భంలో కావలి కందుకూరు వైద్యశాల అధినేత ఐ యమ్ ఎ సభ్యులు ఎన్. రామస్వామి తమ పిల్లలకి 50 వేల రూపాయలు ఇచ్చి ఆదుకున్నారని ఆయన దాతృత్వాన్ని కొనియాడారు. ఆయన కుటుంబానికి తమ కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటామన్నారు .తమ పిల్లల కోసం లక్ష 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిందన్నారు. తమ పిల్లలు ఆ సాయంతో చదువుకొని పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కృషి చేసేందుకు తన వంతు సహకారం అందిస్తామన్నారు. తమకు సాయం అందించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Home ఆంధ్రప్రదేశ్ హరి కొండరాజు కుటుంబానికి 50 వేల ఆర్థిక సహాయం అందించిన కందుకూరు హాస్పిటల్ అధినేత ఎన్...