Home తెలంగాణ ముగిసిన న్యాక్ బృందం పర్యటన

ముగిసిన న్యాక్ బృందం పర్యటన

310
0

పెద్దపల్లి నవంబర్ 25

గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాక్ బృందం రెండురోజుల పర్యటన గురువారంతో ముగిసింది. రెండవరోజు న్యాక్ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ రామంచంద్ర గౌడ, ముని నారాయణ సభ్యులు ప్రొపెసర్ ఎన్.ప్రేమలత, ప్రొఫెసర్ అలోక్ కుమార్ కళాశాలలో రెండురోజుల పాటు జరిపిన తనిఖీ పట్ల నివేదికలు తయారు చేశారు. వాటిని సీల్డ్ కవర్ లో పెట్టి ప్రిన్సిపాల్ కి అందజేశారు. తదుపరి నాక్ కేంద్రం ఆదేశాల ప్రకారం తుది ఫలితం మెయిల్ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ ఖాజా జహీర్ అహమ్మద్ న్యాక్ బృందాన్ని శాలువాలతో సత్కరించి జ్ణాపికలు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ఐక్యూఏసి కే‌ఓ ఆర్డినేటర్ డా. కలందర్ భాషా, అధ్యాపకులు రాజేష్, డా. తన్నీరు సురేశ్, సుబ్బారావు, అజయ్ కుమార్, బుర్ల వెంకటేశ్వర్లు, అర్జున్, నాగేశ్వరరావు, నరేశ్ సంగీత, శ్రీదేవి, ప్రశాంతి, స్రవంతి, కిరణ్మయి,  సౌజన్య సూపరిండెంట్ శ్రీనివాస్, టి.ఎస్.కె.సి ఉషారాణి బోధనేతర సిబ్బంది శ్రీధర్, షాహీదా బేగం, కలీమ్ లు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్వర్యంలో న్యాక్ బృందానికి సత్కారం పూర్వ విద్యార్థుల సంఘం అధ్వర్యంలో అధ్యక్షులు దయానంద్ గాంధీ, జనరల్ సెక్రటరీ గడ్డం శ్యామ్, సభ్యులు, గుమ్మడి కుమారస్వామి, జెట్టి రాము, సందీప్, కిరణ్, సంగీతలు గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన న్యాక్ బృందానికి కృతజ్ణతలు తెలుపుతూ శాలువాలతో సత్కరించి జ్ణాపికలు అందజేశారు

Previous articleరోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే చిన్నయ్య..
Next articleఅమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుంటాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here