Home వార్తలు అక్కినేని నాగార్జున, కళ్యాణ్ కృష్ణ, జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ ‘బంగార్రాజు’ నుండి...

అక్కినేని నాగార్జున, కళ్యాణ్ కృష్ణ, జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ ‘బంగార్రాజు’ నుండి నాగ చైతన్య ఫస్ట్ లుక్ విడుదల

219
0

అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. ఆ సినిమాలో  కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. తండ్రీ కొడుకుల బంధాన్ని చక్కగా పండించి అందరినీ మెప్పించారు. ప్రస్తుతం  సోగ్గాడే చిన్ని

నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న  ‘బంగార్రాజు’ చిత్రంతో ఈ ఇద్దరూ మరో సారి మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నారు. నాగ చైతన్య బర్త్ డే ( నవంబర్ 23) సందర్బంగా టీజర్‌ను విడుదల చేయబోతోన్నారు. కానీ అంత కంటే ముందుగానే

ఈ రోజు నాగ చైతన్య పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను  విడుదల చేశారు. చేతిలో కర్ర పట్టుకుని నాగ చైతన్య కనిపించడం, ఆ గెటప్, చేతికి బ్రాస్ లెట్ ఇలా అన్ని చూస్తుంటే పాత్ర మీద అందరికీ ఆసక్తి పెరిగిపోతోంది. రొమాన్స్, ఎమోషన్స్, అన్ని

రకాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న బంగార్రాజు చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తున్నారు. నాగ చైతన్యకు జోడిగా కృతి శెట్టి కనిపించనున్నారు. నాగలక్ష్మీగా కృతి శెట్టి పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను నాగ చైతన్య విడుదల చేయగా..

మంచి స్పందన వచ్చింది.   లడ్డుండా అనే పాట ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ పాటకు విశేష స్పందన లభించింది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి

నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.
మైసూర్‌లో ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ జరుగుతోంది.
నటీనటులు : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య,  రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ

Previous articleవింగ్ కమాండర్ అభినందన్ కు ప్రతిష్టాత్మక ‘వీర్ చక్ర’ అవార్డు ప్రదానం
Next articleమ‌ళ్లీ కోవిడ్ పాజిటివ్ కేసుల‌తో స‌త‌మ‌తం అవుతున్న యురోప్ దేశాలు బుడాపెస్ట్‌ లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి భారీ సంఖ్య‌లో ఎగ‌బ‌డ్డ జ‌నం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here