నెల్లూరు
సాయం కోరి వచ్చిన వారికి మాజీ సెంట్రల్ బ్యాంక్ వైస్ ఛైర్మన్, శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ట్రస్ట్ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని అందరికీ తెలిసిందే. నేరుగానే కాక, సోషల్ మీడియా వేదికగానూ ప్రజలు తమ సమస్యను విన్నవించడమే ఆలస్యం ఆయన వెంటనే స్పందిస్తుంటారు. ఇలా ఎంతో మంది ప్రాణాలను కాపాడటమే కాక, మరెందరో జీవితాల్లో వెలుగులు నింపారు. తాజాగా డబ్బులు లేక ఉన్నత చదువుకు దూరం అవుతున్న ఓ విద్యార్ధికి జగన్మోహన్ రెడ్డి బాసటగా నిలిచారు.తానున్నానంటూ.. భరోసా కల్పించడమే కాకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
వివరాల్లోకెళితే.. నెల్లూరు జిల్లా ,చిట్టమూరు మండలం, అరవపాళెం గ్రామానికి చెందిన లింగా రెడ్డి వెంకట సుబ్బా రెడ్డి కుమారుడు సాయి కృష్ణా రెడ్డి అనే విద్యార్థికి తిరుచానూరు లోని సంస్కృతి జూనియర్ కళాశాలో సిటు వచ్చింది. అయితే, కాలేజీలో చేరేందుకు అవసరమైన డబ్బు వారి వద్ద లేదు. పేదరికం, ఆర్థిక సమస్యల నేపథ్యంలో చదువును మధ్యలోనే ఆపేసే పరిస్థితి నెలకొంది. దాంతో సాయి కృష్ణా రెడ్డి నేరుగా కోటకు చెందిన శ్రీ షిరిడీ సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య ను ఆశ్రయించారు.
సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కడు పేదరికంలో మగ్గుతున్నానని, తన చదువును కొనసాగించేందుకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. వెంటనే స్పందించిన అల్లం రమణయ్య నెల్లూరు లో ఉన్న నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. యువకుడు పరిస్థితిపై ఆరా తీశారు. యువకుడు చదువుకు అవసరమైన నిధులను సమకూరుస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు కోటలో సాయి కృష్ణా రెడ్డి చదువుకు అవసరమైన ఫీజు 60 వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి చేతులు మీదుగా అందజేశారు.
కాగా, తాను ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది, వచ్చే ఏడాదికి సంబంధించిన ఫీజుల కూడా అందించస్తాం అని హామి ఇచ్చారు.సాయి కృష్ణా రెడ్డి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.మరోవైపు జగన్మోహన్ రెడ్డి సాయం చేయడంపై సాయి కృష్ణా రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. తమ కుమారుడు విద్యకు ఆర్థిక సాయం చేసిన జగన్మోహన్ రెడ్డికి తండ్రి వెంకట సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.