కామారెడ్డి అక్టోబర్ 04
కామారెడ్డి జిల్లా లో ఎల్లారెడ్డి ఎమ్యెల్యేతో సహా 23మందిపై పోలీసులు పెట్టినకేసును కొట్టివేస్తూ సోమవారం నాంపల్లి కోర్టు జడ్జీ తీర్పునిచ్చారు.ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి ఎల్లారెడ్డి మండలంలోని లింగారెడ్డిపేట్ గ్రామ చెరువు పక్కనమిషన్ కాకతీయపనులు అస్తవ్యస్తంగా చేయడం వల్లగ్రామానికి చెందినఒక మహిళ ప్రమాదవశాత్తు పడి మరణించింది. 2017 లో ప్రస్తుతఎమ్మెల్యే జాజాల సురేందర్ అప్పట్లో నష్టపరిహారం చెల్లించాలని కొందరు నాయకులు, ప్రకలతో కలిసి ధర్నా రాస్తారోకో చేశారు. ఈ సంఘటనతో ప్రస్తుత ఎమ్మెల్యేతో సహా 23 మందిపై అప్పట్లో ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని రోజులపాటు ఎల్లారెడ్డి కోర్టులో ఈ కేసు విచారణజరిగింది. గతఏడాది ఈ కేసును హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు బదిలీ చేశారు . పోలీసులు పెట్టిన కేసులో సరైనసాక్ష్యాలు లేవని నాంపల్లి కోర్టు జడ్జి సోమవారం కేసు విచారణఅనంతరం కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చారు. లింగారెడ్డిపేట్ గ్రామానికి చెందినకొంతమందితో మున్సిపల్ చైర్మన్ కుడుములసత్యనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుభాష్ రెడ్డి, బీజేపీ నాయకుడు పైలా కృష్ణారెడ్డి వున్నారు. తమపై పోలీసులు పెట్టినకేసు కొట్టివేయడం పై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు