నంద్యాల
నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి సబ్ కలెక్టరును కలిసారు. నంద్యాల సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. కొత్తగా మంజూరు అయిన వైద్యకళాశాలను నంద్యాల లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం [ఆర్ఎఅర్ యస్ ] లో కాకుండ భీమవరం గ్రామంలొ ప్రభుత్వ అధీనంలొ వున్న భూమి, వేరే ప్రదేశంలో గానీ భూమిని కొని అందులో వైద్యకళాశాలను నిర్మించాలని కోరారు. అందుకు సబ్ కలెక్టరు గారు అన్ని పరీశిలించి తగిన చర్యలు తీసుకొంటామని అన్నారని తెలిపారు . తెలుగు దేశం పార్టి కౌన్సిలర్లకు తమ వార్డులోని సమస్యలు కౌన్సీల్ సమావేశములో మాట్లెడుందుకు అవకాశము ఇవ్వడము లేదని మరియు మునిసిపల్ నిధులు జమ ఖర్చు వివరములు కౌన్సిల్లో సమావేశంలో ప్రవేశ పెట్టడం లేదని . సబ్ కలెక్టరు కి తెలియజేశామని అన్నారు. మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడుతానని సబ్ కలెక్టర్ తెలిపారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కౌన్సిలర్లు పాల్గొన్నారు