నంద్యాల
గోసుపాడు అక్టోబర్ 21
గురువారం గోసుపాడు మండల తహసిల్దార్ వారి కార్యాలయం ను నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి చాహత్ బాజ్ పాయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు..అనంతరం నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ గోస్పాడు మండల తాసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేయడం జరిగిందన్నారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించగా సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. మండలంలో జరుగుచున్న భూముల స్వచ్చీకరణ. భూముల రీ సర్వే . కోవిడ్ నివారణ వ్యాక్సిన్. యం డి యు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ సక్రమంగా సరఫరా చేయాలని కోరారు .మరియు స్పందన కు వచ్చినటువంటి వినతులను సత్వరమే పరిష్కరిస్తున్నారా. ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా అని తహసీల్దార్ మంజులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి భూముల స్వచ్చీకరణ పై తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రామచంద్రరావు గ్రామ మరియు మండలసర్వేయర్లు. వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.