Home జాతీయ వార్తలు నరేంద్ర మోదీ బలం తెల్సుకుంటేనే ఆయన్ని ఓడించగలరు బీజేపీ గెలిచినా, ఓడినా రాజకీయాలకు కేంద్రంగా...

నరేంద్ర మోదీ బలం తెల్సుకుంటేనే ఆయన్ని ఓడించగలరు బీజేపీ గెలిచినా, ఓడినా రాజకీయాలకు కేంద్రంగా ఉంటుంది రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌

115
0

గోవాఅక్టోబర్ 28
గోవాలో పర్యటిస్తున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీపై విచిత్రమైన కామెంట్లు చేశారు. రానున్న మరికొన్నేండ్లపాటు బీజేపీ అతిపెద్ద శక్తిగా నిలుస్తుందని, బీజేపీ గెలిచినా, ఓడినా రాజకీయాలకు కేంద్రంగా ఉంటుందన్నారు. నరేంద్ర మోదీ బలం తెల్సుకుంటేనే ఆయన్ని ఓడించగలరని చెప్పారు. ప్రజలు మోదీని ప్రధాని పీఠం నుంచి తోసేసే రోజు కోసం రాహుల్‌గాంధీ ఎదురుచూస్తున్నారని చురకలంటించారు. మోదీ అధికారంలో ఉన్నంత వరకే బీజేపీ బలంగా ఉంటుందన్న బ్రమల్లో రాహుల్‌ ఉన్నారని చమత్కరించారు. మూడింట ఒక వంతు ఓట్లు మాత్రమే బీజేపీ వస్తుంటే.. మిగతా రెండు వంతుల ఓట్లను 10-15 పార్టీలు పొందుతున్నాయని, దీనికి కాంగ్రెస్‌ బలహీనతే ప్రధాన కారణమన్నారు.భారతీయ జనతా పార్టీ రాబోయే దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో ప్రధాన శక్తిగా కొనసాగుతుందని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. మొదటి 40 ఏండ్లు భారత రాజకీయాల్లో కాంగ్రెస్ కేంద్రంగా ఉన్నట్లే.. బీజేపీ ఓడిపోయినా, గెలిచినా కూడా రాజకీయాలకు కేంద్రంగా నిలుస్తుందని చెప్పారు. నరేంద్ర మోదీ బలాన్ని అర్థం చేసుకోకపోతే, అతన్ని ఓడించలేరని స్పష్టం చేశారు. చాలా మంది తమ శక్తిని అర్థం చేసుకోవడానికి సమయాన్ని వెచ్చించరని చెప్పారు. మోదీ పాపులారిటీకి కారణం ఏంటో అర్థం చేసుకుంటే గానీ, ఆయన్ను ఓడించడానికి కౌంటర్ దొరుకుతుందని కాంగ్రెస్‌ నేతలకు సూచించారు.మోదీపై ప్రజలు కోపంతో ఉన్నారని, ఆయన్ను బయటకు పంపిస్తారనే ఉచ్చులో ఎప్పుడూ పడొద్దని ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పారు. బహుశా మోదీని పారద్రోలవచ్చేమో కానీ, బీజేపీ ఎక్కడికీ వెళ్లదన్నారు. రాబోయే కొన్ని దశాబ్దాలు బీజేపీతో పోరాడాల్సి ఉంటుందని, అందుకు మానసికంగా, శారీరకంగా కాంగ్రెస్‌ నేతలు సిద్ధంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గురించి మాట్లాడుతూ.. మోదీ అధికారంలో ఉన్నంత వరకు మాత్రమే బీజేపీ బలంగా ఉంటుందన్న భ్రమలో రాహుల్‌ ఉన్నారని, బహుశా ప్రజలు మోదీని అధికారం నుంచి త్రోసిపుచ్చే సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు రాహుల్‌ భావిస్తున్నాడని చెప్పారు.

Previous articleకొవిడ్ ప్రభావం ఆసియాన్ దేశాలు-భారత్ మధ్య స్నేహానికి సవాల్‌ 2022ను ఐక్యతా సంవత్సరంగా జరుపుకుందా… ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
Next articleవిత్తనాలు పంపిణి కార్యక్రమం లో పాల్గొన్న ఏ వో బాలకృష్ణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here