మహబూబ్ నగర్, అక్టోబర్ 27:
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బాద్షా బౌలి లో గల మదర్సా బర్హాన్ ఉల్ ఉలోమ్ ఆవరణలో మంగళవారం రాత్రి అంజుమనే ఫైజానే శర్ఫీయ ఆధ్వర్యంలో హాజ్రత్ అతం షర్ఫి జ్ఞాపకార్థం నాతె షరీఫ్ పోటీలు నిర్వహించారు. హజ్రత్ షా రాఫిఉద్దిన్, చందా హుస్సేనీ పర్యవేక్షణలో నాతే షరీఫ్ పోటీలు నిర్వహించారు. పోటీలకు జడ్జీలుగా హైదరాబాద్కు చెందిన అనిస్ మొహమ్మద్ ఖాద్రీ, వహీదుద్దీన్ సలీం, సయ్యద్ ఖలీల్ వ్యవహరించారు. పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహ్మద్ అమెర్ బంగారు పతకాన్ని సాధించగా మిగతా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బర్హానే బాద్షా దర్గా ముతవల్లి డాక్టర్ గయాస్ పాషా ఖాద్రీ, వారిస్ పాషా ఖాద్రి, జహంగీర్ పాషా ఖాద్రీ, సయ్యద్ శర్ఫీ తదితరులు పాల్గొన్నారు .