న్యూఢిల్లీ నవంబర్ 23
సింహాద్రిలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టిపిసి) నుంచి వచ్చే వ్యర్థాలతో పర్యావరణానికి ముప్పు జరుగుతుందనే అంశంపై అధ్యయనానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్ ఓ కమిటీని నియమించింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, విశాఖ జిల్లా కలెక్టర్‌లతో సంయుక్త కమిటీ వేసింది. విద్యుత్ కేంద్రాన్ని స్వయంగా సందర్శించి నివేదిక రూపొందించాలని ఆదేశించింది.సింహాద్రి NTPC పై పర్యావరణ క్లియరెన్స్, వాయు, నీరు, నేల కాలుష్యం, వ్యవసాయానికి జరిగిన నష్టం, సీఎస్‌ఆర్ నిధుల అమలు తదితర షరతులు పాటించకపోవడం లాంటి ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ అంశాలన్నింటిపైన విచారణ జరిపి నివేదిక అందించాలని కమిటీని ఎన్జీటీ ఆదేశించింది. తదుపరి విచారణలోగా కనీసం మధ్యంతర నివేదిక ఇవ్వాలని కోరింది. పర్యావరణం, వ్యవసాయ నష్టానికి పర్యావరణ పరిహారాన్ని అంచనా వేయాలని ఎన్జీటీ తన ఆదేశాల్లో పేర్కొన్నది. దీనిపై తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 7కు వాయిదా వేసింది.