హైదరాబాద్ అక్టోబర్ 27
భారత నావికా దళానికి చెందిన పలువురు అధికారులు ఇవాళ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారిలో వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్‌సింగ్‌తోపాటు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఈస్టర్న్ నావల్ కమాండ్‌తోపాటు ఇతరులు ఉన్నారు. వీళ్లంతా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. రాజ్‌భవన్ ప్రెస్ సెక్రెటరీ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.