న్యూఢిల్లీ నవంబర్ 8
కేంద్ర ప్రభుత్వం భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్ మండిపడ్డారు. రైతు ఉద్యమంలో రైతుల మరణాలపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి సంతాపం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉద్యమంలో దాదాపు 750 మంది రైతులు మృతి చెందారు. గర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి సంతాపం లేదు’ ఆరోపించారు. ప్రధాని తాను రైతులకు కూడా ప్రధానినే అని భావించడం లేదని, తమను వేరుగా చూస్తున్నాడని భావిస్తున్నారని టికాయిత్ అన్నారు. ఇంతకు ముందు ఆయన మాట్లాడుతూ రైతులు నిరసన ప్రదేశాన్ని విడిచి ఎక్కడికి వెళ్లరని స్పష్టం చేశారు. ఒక ప్రభుత్వం ఐదేళ్లపాటు నడపగలిగితే.. భారత ప్రభుత్వం ఎంఎస్‌పీకి భరోసా ఇచ్చే చట్టాన్ని ఆమోదించి, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ప్రజల ఆమోదంతో నిరసన కొనసాగుతుందని పేర్కొన్నారు.