నెల్లూరు నవంబర్ 18
నెల్లూరు జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో వాగులు వంకలు నుండి సమీప పొలాల గట్లు ,నీటి ప్రవాహంతో కోసూకు పోవడంతో తాటి చెట్లు చెట్లు సైతం నేలకొరిగాయి. బీభత్సమైన ఈదురు గాలులుతో కూడిన వర్షాలకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పెన్నా పరివాహక గ్రామాల ప్రజలకు అధికారిక హెచ్చరికలు. జిల్లా పరిధిలోని సోమశిల డ్యామ్కు ఎక్కువగా నీరు చేరడంతో ప్రస్తుతం 10 గేట్ల ద్వారా 80 వేలకు పైగా క్యూసెక్కుల నీటిని పెన్నా నదికి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చేజర్ల మండల పరిధిలోని పెన్నా పరివాహక గ్రామాలైన కోటితీర్థం, తూర్పు కంభంపాడు , ఉలవపల్లి, కొట్టాలు , పుట్టుపల్లి, పెరుమళ్ళపాడు, చలపనాయుడు పల్లి, పుల్లనీళ్ళ పల్లి, మాముడూరు, అగ్రహారం తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చేజర్ల మండల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పి. విజయ్ శ్రీనివాస్ గురువారం అధికారిక హెచ్చరికలు జారీ చేశారు. పైన పేర్కొనబడిన గ్రామాల ప్రజలకు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల రీత్యా ఎటువంటి సమస్యలు ఎదురైనా 9440700008 నంబర్ను సంప్రదించవలసినదిగా సూచించారు.
Home ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలతో అతలాకుతలమౌతున్న నెల్లూరు జిల్లా పెన్న పరివాహక గ్రామాల ప్రజలకు అధికారిక హెచ్చరికలు