గ్రామీణ రొడ్ల నిర్మాణంలో నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం మిని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో పీఎంజీఎస్వై గ్రామీణ రహదారుల నిర్మాణంలో నూతన సాంకేతికత వినియోగించే విధానం పై నిర్వహించిన వర్క్ షాపులో జిల్లా కలెక్టర్ జి.రవి తో కలిసి జడ్పీ చైర్ పర్సన్ పాల్గోన్నారు. గ్రామీణ ప్రాంతంలో రొడ్ల నిర్మాణంలో వినియోగించే నూతన సాంకేతికత పై పంచాయతీ రాజ్ ఇంజనీర్లు, గుత్తేదార్లు అవగాహన పెంచుకోవాలని ఆమె కోరారు. ఇంజనీర్లు మరియు గుత్తేదార్లు నూతన సాంకేతికత సమన్వయంతో నూతన సాంకేతికత పట్ల అవగాహన పెంచుకొని, అతి తక్కువ ఖర్చుతో ప్రజలకు మౌలిక వసతైన రహదార్లు కల్పించే విధంగా కృషి చేయాలని జడ్పీ చైర్ పర్సన్ ఆకాంక్షించారు.
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రణాళికాబద్దంగా జాతీయ ఉపాధి హమి నిధులను వినియోగించుకుంటున్నామని, గ్రామాలో రైతు వేదికలు, స్మశానవాటికలు, డంపింగ్ యార్డులు, నర్సరీ, మొక్కల పెంపకం వంటి వాటికి ఉపాథి హమి నిధులు వినియోగించుకొని, గ్రామాలో మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. సీఎం కేసిఆర్ ఆదేశాలతో గ్రామీణ ప్రాంతాలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం కల్పించి కార్యక్రమాలను చేపట్టామని జడ్పీ చైర్ పర్సన్ తెలిపారు. జగిత్యాల జిల్లాలో ప్రధానమంత్రి సడక్ యోజన్ కింద 12 రొడ్లు, 4 వంతెనలు మంజూరయ్యాయని, కేంద్రం ప్రభుత్వం మరిన్ని రొడ్లు, వంతెనెల నిర్మాణ పనులు మంజూరు చేయాల్సి ఉందని ఆమె విజ్ఞప్తి చేసారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలో రొడ్ల నిర్మాణాలకు కేంద్రం ప్రభుత్వం త్వరితగతిన మరిన్ని నిధులు విడుదల చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో పాల్గోన్న జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ నూతన సాంకేతికతను వినియోగిస్తు అతి తక్కువ ఖర్చుతో రొడ్లు నిర్మించాలని తెలిపారు. పర్యావరణాన్నీ కలుషితం చేసే పదార్థాలను వినియోగిస్తు , పర్యావరణ హితంగా ఇటీవలె కొన్నీ రొడ్లు నిర్మించారని, అటువంటి నూతన పద్దతుల పై అధ్యయనం చేయాలని కలెక్టర్ తెలిపారు.మనం ప్రతి రోజు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని, అప్పుడే మంచి ఫలితాలు అందించకలుగుతామని కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతంలో రొడ్ల నిర్మాణం తక్కువ ఖర్చుతో, నిర్వహణ వ్యయం తక్కువగా ఉండే విధంగా, అధిక సమయం ఉపయోగించుకునే విధంగా, అదే సమయంలో నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా నూతన సాంకేతికత వినియోగిస్తు నిర్మించడానికి గల అవకాశాల పై సంపూర్ణ అవగాహన కల్గి ఉండాలని తెలిపారు.ప్రస్తుతం నిర్వహిస్తున్న వర్కషాపును ఇంజనీర్లు, గుత్తేదార్లు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
జగిత్యాల ఆగస్టు 21