అమరావతి సెప్టెంబర్ 18
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా నైట్ కర్ఫ్యూ ఆంక్షలను ఈ నెల 30 వరకు కొనసాగిస్తామని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి మరసటిరోజు ఉదయం 6గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నది. కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంక్షల్ని ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం 2005 కింద చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.