జగిత్యాల సెప్టెంబర్ 04
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో పోలీస్ బోర్డుకే రక్షణ కరువయ్యింది. ఇంకా ప్రజలకు రక్షణ ఎక్కడిది అని బుగ్గారం మండల వాసులు ముచ్చటించు కుంటున్నారు. ఇప్పటికీ పలు మార్లు ఈ బోర్డు పరిస్థితి ఇలానే అయిందని ప్రజలు వాపోతున్నారు. ఏకంగా పోలీస్ బోర్డునే పీకేసి మురికాలువలో పడేశారు. గతంలోనూ ఎలాంటి అనుమతి లేకుండా ఇదే బోర్డును తీసేసి ఒక రాజకీయ పార్టీ జెండా గద్దె నిర్మించారు. వార్తల్లోకి ఎక్కాక ప్రక్కకు జిపి సిబ్బందితో మళ్లీ పాతించారు. ఈ బోర్డు ద్వారా పోలీస్ స్టేషన్ కు దారి చూపడం ఏమో కానీ, ఈ సారి కూడా గుర్తు తెలియని వ్యక్తులు పాతి ఉంచిన పోలీస్ బోర్డును తీసి ప్రక్కనే గల మురికాలువలో పడేయడం మళ్లీ వివాదాస్పద చర్చకు దారి తీసింది.