విజయవాడ
ఇంద్రకీలాద్రిలో అమ్మవారి దర్శనానికి రెండో రోజు కూడా వచ్చాం.ప్రముఖులు, తెలిసిన వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. దసరా ఉత్సవాలలో పనులు చేసేవారికి సదుపాయాలు లేవని జనసేన అధికార ప్రతినిధి, పోతిన మహేష్ విమర్శించారు. దసరా రాష్ట్ర ఉత్సవం అయితే బడ్జెట్ ఎంత. ఇది రాష్ట్ర ఉత్సవమేనా.. 70 కోట్ల నిధులు ఎందుకు ఇంకా అమ్మవారి ఖాతాకి రాలేదు. రాష్ట్ర ఉత్సవంలా లేదు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్సవంలా రంగులేసారని అరోపించారు. అన్యమత ప్రచారం వైసీపీ నాయకులే నిన్న చేయించారు. ఆలయం ఏర్పాటు చేసిన స్క్రీన్స్ లో ఎలా అన్యమత ప్రచారం వచ్చింది. స్క్రీన్స్ కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి. నలుగురు ఈఈ లు, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఏం చేస్తున్నారు. ఇతర ఆలయాల ఈఓ లను నలుగురిని తీసుకొచ్చారు. ఉత్సవ శోభ ఏమైంది. ఐరన్ ఫ్రేం ఏమైంది.మామిడి తోరణాలు కూడా లేవు. ఆధ్యాత్మిక కేంద్రమా… వ్యాపార కేంద్రమా. సీఎం పట్టువస్త్రాలు సమర్పించే నాటికైనా ఇవన్నీ సరి చేయాలి. ఒక వ్యక్తి ఆలయంలో చనిపోతే సంప్రోక్షణ ఎందుకు జరగలేదు. జనసేన ఎప్పుడూ అమ్మవారికి కాపలాదారుగా ఉంటుందని అన్నారు.