సిఎం జగన్
అమరావతి నవంబర్ 19
అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను వైసీపీ నాయకులు ఎవరూ కూడా ప్రస్తావించలేదని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. కావాలంటే సభా రికార్డులను పరిశీలించుకోవచ్చని ఆయన సూచించారు. సంబంధం లేని విషయాలను తీసుకొచ్చి సభలో రెచ్చగొట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు కళ్లలో నీళ్లు లేకపోయినా, కన్నీరు పెట్టుకున్నారని, ఇదంతా డ్రామా అని అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ కొట్టి పారేశారు. మా అమ్మ, చెల్లి, చిన్నాన్న పేర్లను చంద్రబాబు ప్రస్తావించారు.వంగవీటి రంగా, మాధవరెడ్డి, వైఎస్ వివేకా హత్యలు చంద్రబాబు హయాంలోనే జరిగాయి. మల్లెల బాబ్జీ సూసైడ్ నోట్‌లో బాబు పేరు ఉంది. చిన్నాన్న వైఎస్ హత్యను వారే ఏమైనా చేసారేమోనని అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు. కుప్పం ప్రజలు వ్యతిరేకించడం వల్లే చంద్రబాబు ప్రస్టేషన్‌లో ఉన్నారని, అన్ని ఆ దేవుడు చూస్తున్నాడని జగన్ వ్యాఖ్యానించారు