జగిత్యాల సెప్టెంబర్ 28
మున్సిపాలిటీ ద్వారా పట్టణంలో జరిగే అభివృద్ధి పనులపై అలసత్వం వహించరాదని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి -ప్రవీణ్ ఆన్నారు.మంగళవారం జగిత్యాల పురపాలక సంఘం కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులతో జగిత్యాల పట్టణంలో జరుగుతున్న ఆభివృద్ది పనులపై మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ జగిత్యాల పట్టణంలో జరుగుతున్న అభివృద్ది పనుల గూర్చి ఆరాతీశారు, పనులలో జరుగుతున్న జోప్యం పై అధికారులపై మండిపడ్డారు. టెండర్లు అయికూడా ఇంకా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలన్నారు. పట్టణంలో నిర్మిస్తున్న అభివృద్ది పనుల వల్ల విజువల్ ఇంపాక్ట్ కనబడేలా ఆభివృద్ది పనులు నిర్వహించాలన్నారు. పట్టణ అభివృద్ధి, సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని పచ్చదనంతో పాటు వైకుంఠధామాల నిర్మాణం, టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్సులపై చర్చించారు. పెండింగ్ లో ఉన్న పనులతో పాటు నూతనంగా చేపట్టనున్న అంశాలపై సమీక్షించారు. ధరూర్ క్యాంపులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ట్రీ పార్కు పనులను వేగవంతం చేయాలన్నారు.అభివృద్ది పనులలో ఎలాంటి అలసత్వం వహించరాదన్నారు.ఈ సమీక్ష సమావేశంలో డి.ఈ రాజేశ్వర్ రావు, ఏ.ఈ ఆయుబ్ ఖాన్, వర్క్ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు..